నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం: పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)ద్వారా ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాపిట్ల సైదమ్మకు చెక్కు మంజూరు కాగా.. గట్టయ్య సెంటర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ లబ్ధిదారుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య చికిత్సలు పొందిన పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు.. ఎంపీ సిఫారసుతో ఇప్పటి వరకు వెయ్యి మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ఆరోగ్యానికి భరోసాను ఇస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Post Views: 74









