+91 95819 05907

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు

— పలువురు వక్తలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని తమ భుజాన మోస్తూ సంరక్షిస్తున్న వారంతా.. మహిళలే కాబట్టి మహిళలే మహారాణులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం ముందస్తు అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని రఘునాథ పాలెం మండల కేంద్రంలో గల నిర్మాణం కానున్న సేవా లాల్ మహరాజ్ ఆలయ ప్రాంగణంలో వీరనారీమణుల ఆశయసాధన సమితీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మహిళల ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతను నేటి సమాజంలో వారి ఔనత్యాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తొలుత వీరనారీమణుల ఆశయ సాధన సమితీ గౌరవ సలహాదారులు, ముఖ్య అతిథి చిట్యాల స్వేత మాట్లాడుతూ.. సమాజంలో గల ద్వంద్వ ప్రవృత్తని ఎండగట్టాలని మహిళలకు తగిన గౌరవం ఇస్తామంటూనే వారిని అగౌరపరిచే పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామని వీటికి ఎదురీదుతూనే ప్రతిఘటనాత్మక పోరాటాలు చేయాలని అప్పుడు మనకు విజయాలు దక్కతాయని అన్నారు. మహిళలు తలుచుకుంటే అసాధ్యమనేది ఏదీ లేదని, కుంగిపోకూడదని మన మీద ఇల్లు, సమాజమే ఆధారపడి ఉండగా మనం వెనుకడుగు వేయకూడదని అన్నారు. నేటి తరం చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ముందడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మిస్సెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ ఎంఏ.ఫర్హా మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా సమాజంలో ఉన్నటువంటి మహిళలు సామాన్య మహిళలుగా మిగలకూడదని అనుకుంటే వారు ముందుకొచ్చి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని కోరారు. మహిళలు వివక్షతకు, ఆత్మ న్యూనతకు కూడా గురికాకూడదనుకుంటే వారంతా జ్ఞానం కోసం .., ఆ జ్ఞానానికి విద్యాభ్యాసన అత్యంత ఆవశ్యకత అని అన్నారు. ఇదే సమయంలో తమ ఆరోగ్యం, తమ ఆర్థిక భద్రతలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించాలని అప్పుడు మహిళలకు ఎలాంటి అవరోధాలు ఉండవని తెలిపారు. సామాజిక ఉద్యమకారిణి విజయలక్ష్మీ మాట్లాడుతూ.. సమాజంలో అత్యధిక సంఖ్యాక వర్గంగా మన మహిళలే ఉన్నారని గతంలో వలే కాకుండా నేడు మనం మహరాణులు గా సమాజంలో ప్రభావ శీలులు గా జీవిస్తున్నామని అన్నారు. కారణం విద్య కాబట్టి ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. రఘనాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ మాట్లాడుతూ.. నేడు అన్నింట మహిళలే దూసుకుని పోతున్నారని అన్నారు. మహిళలకు తగిన ప్రోత్సాహం అందజేస్తే వారు మంచిగా రాణిస్తారని పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్షతను ప్రదర్శించకూడదని వారికి తగిన సహకారం అందజేస్తే మంచిదని తాను కూడా మహిళల పట్ల సానుభూతితో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటానని అన్నారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితీ జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పీఎస్ బాణోత్ భద్రు నాయర్, రఘునాథపాలెం సర్పంచ్ గాజుల క్రిష్ణ, గిరిజన సమాఖ్య రాష్ర్ట కన్వీనర్ వీరన్న నాయక్ లు ప్రసంగించగా నాయకులు భూక్యా జ్యోతి, కె.స్పందన, జాన్సీ, నాగమణి, సరోజిని, బాణోత్ ఉషా, వి.భద్రమ్మ, కవిత, లక్ష్మీ, సుభద్ర, రంగమ్మ, లక్ష్మీ నాయక్, బి. లక్ష్మీ, విజయ, షరీఫా బేగం, ప్రమీల, నద్యా నాయక్, బాలు నాయక్, సంజీవరావు, దాసరి శ్రీనివాస్, రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, యాకేష్, విజయ, శ్రీనివాస చారీ, వీరన్న, డాక్టర్ రామకోటీ, నాగరాజు, శ్రీనివాస్ నాయక్, కళాకారులు పమ్మి రవి, ఫక్రుద్దీన్, కొమ్ము రాదా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు

మహిళలే మహరాణులు — పలువురు వక్తలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం : గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏమీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం

Read More »

ప్రజా క్షేత్రంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుడిగాలి పర్యటన!

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికే లక్ష్యం: పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అధికారులకు దిశానిర్దేశం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గం ఎమ్మెల్యే

Read More »

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

 Don't Miss this News !