వంట గ్యాస్ ధరల పెరుగుదల పేద ప్రజలకు భారం
సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి
నేటి గదర్ న్యూస్, వైరా :
వంట గ్యాస్ ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి ప్రజలకు భారం అని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలని ఆదివారం సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం పార్టీ వైరా పట్టణ కన్వీనర్ సుంకర సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు ఒకేసారి గ్యాస్ మొద్దుకు 65 రూపాయలు, కమర్షియల్ మొద్దుకు 115 రూపాయల చొప్పున పెంచడం వలన పేద మధ్యతరగతి ప్రజలకు భారం అవుతుందని అన్నారు. ప్రజలపై భారం పడకుండా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యురాలు మెరుగు రమణ, డివిజన్ నాయకులు తోట నాగేశ్వరావు, పట్టణ నాయకులు బొంతు సమత, కొంగర సుధాకర్, హరి వెంకటేశ్వరావు, కామినేని రవి, తోట కృష్ణవేణి, మల్లెంపాటి రామారావు, గండగలపాడు మున్సిపాలిటీ కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, యనమద్ది రామకృష్ణ, కంసాని మల్లికాంబ, భూక్యా విజయ, అమరనేని కృష్ణ, ఇమ్మడి సుధీర్, చావా కళావతి బందెల అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.









