త్రాగునీటి సమస్య పరిష్కారానికి బోర్ వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు త్రాగునీటి సమస్య పరిష్కారం దిశగా మొదటి వార్డులో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రబాత రావు,బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో టెంకాయ కొట్టి బోరు వేయడం ప్రారంభించడం జరిగింది.50 అడుగుల లోతు వరకు బోరు వేయగా పుష్కలంగా నీరు రావడం జరిగింది.150 అడుగుల వరకు బోర్ వేశారు.నీళ్లు పుష్కలంగా రావడంతో వార్డు ప్రజల సంతోషం వ్యక్తం చేశారు.నీటి సమస్య పరిష్కారం చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు కు మంచి మనస్సుతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు సుప్రబాత రావు, రమేష్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భైరం కుమార్,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, చింతల స్వామి గావు భాస్కర్,బొట్ల బాబు, భైరం శంకర్
అసాది రాజు,పార్టీ కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.









