*సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న*
నేటి గదర్ కరకగూడెం :
మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రదర్శన ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మండల కార్యదర్శి కొమరం కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రజా ప్రదర్శన ధర్నా లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ అసలైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు.మండలంలో మిగిలిపోయిన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చి త్రీఫేస్ కరెంట్ వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కొత్త రేషన్
కార్డులు అరులైన వాళ్లందరికీ పెన్షన్లు మరియు
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500
రూపాయలు గ్యాస్ సబ్సిడీ రైతులకు రుణమాఫీ రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అధికారులకు హెచ్చరిక చేశారు.లేదంటే రారన్న రోజుల్లో సిపిఎం పార్టీ
ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు
చేవడుతామని అవసరమైతే ప్రభుత్వ
కార్యాలయం ముందు వంటావార్పు
కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిక చేశారు.
అదేవిధంగా గత 40 సంవత్సరాల నుండి ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చిన ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వలన వాళ్ళ పిల్లలు చదువులు ఆగిపోవడం జరుగుతుందని అదేవిధంగా సర్టిఫికెట్ లేకపోవడం వలన పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వడం లేదని అధికారులకు గుర్తు చేశారు వెంటనే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు సూచన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారుసిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, కనితి రాము, పద్దం బాబురావు, శోభారాణి, లక్ష్మయ్య, పదం సత్యం, రమాదేవి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
