★రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహణ
💠గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో గత నెల 14వ తేదీన భూభారతి చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డిగారి చేతులమీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రయోగాత్మకంగా అదేనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో మరియు ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాం.
💠ఆయా మండలాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులకు నిర్ధేశిత గడువు పెట్టుకొని భూ భారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తాం.
💠ప్రయోగాత్మకంగా నిర్వహించిన మండలాల్లో ఇప్పటికే కొన్నింటిని పరిష్కరించడం జరిగింది. ఈనెల చివరినాటికి వీలైనంతవరకూ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పరిష్కరించలేనివాటికి ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తాం, ఎప్పటికీ పరిష్కారం కానివి ఉంటే అసలు పరిష్కార యోగ్యం లేనివి అక్రమమైనవి ఉంటే అవి పరిష్కారం కావు అని చెప్పడం జరుగుతుంది. సాదాబైనామాలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో స్టే వెకేట్ అయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అనేది భూ భారతి చట్టం లక్ష్యం.
💠ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గత ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ విభాగంలో చేపట్టిన సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. భారతి చట్టాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ చట్టం వల్ల తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న సంతోషం వారిలో కనపడుతుంది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వలన మొత్తం రెవెన్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయి, మొత్తం వ్యవస్ధను ప్రజలకు చేరువు చేసి వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది.









