రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 19:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రామాయంపేట తండాలో సోమవారం నాడు శ్రీ జగదంబ సేవాలాల్ నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శ్రీ జగదాంబ మాత,సేవాలాల్, గణపతి విగ్రహాలను ఆలయానికి విగ్రహ దాతలు గూగులోత్ రవి మంజుల అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట తండాలో తాండవాసులు శ్రీ జగదాంబ మాత సేవాలాల్ ఆలయానికి వెళ్లి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే తాము విగ్రహాలను అందజేసినట్లు తెలిపారు.ఈ సమాజంలో ఇటు ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి జీవించాలని ఆది అలవరచుకొని ఇతరులకు తెలియజేయాలని పేర్కొన్నారు.అప్పుడే మనకు శాంతి సమాధానం సంతోషం ప్రశాంతత దైవ కటాక్షాలు కలుగుతాయని తెలిపారు.మనము దైవికంగా ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే దేవుని ఆశీర్వాదములు మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియపరచారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు రవి మంజుల కుటుంబ సభ్యులు అరవింద్ నాయక్, అవినాష్ నాయక్, సుధాకర్ రాథోడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తాండవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









