ఈనెల 14న మదన్ లాల్ సంస్మరణ సభ.
నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ సంస్మరణ సభను జెడ్పీ కాన్పరెన్స్ హాల్ లో ఈ నెల 14న శనివారం ఉదయం 10.గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాణోత్ భద్రు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యావంతుడిగా.., సర్పంచ్ స్థాయి నుంచి క్రమక్రమంగా వైరా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మదన్ లాల్ సేవలు మరువలేనివని అన్నారు. బంజార జాతికి అందించిన సేవలు మరువలేనవని, అలాంటి నాయకులను గుర్తు చేసుకుంటూ.. సంస్మరణ సభలు నిర్వహించుకోవడం వారికి అందించే నిజమైన నివాళి అన్ని భద్రు నాయక్ పేర్కొన్నారు.ఎల్ హెచ్ పీఎస్, వీరనారీమణు ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా హాజరై నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.
Post Views: 959









