ఎన్ ఎస్ యు ఐ,యువజన కాంగ్రెస్, మండల కాంగ్రెస్ పార్టీ సహకారంతో.
ఆశ్రయ సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన సందర్భంగా బోనకల్ మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు నిర్వహించే ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఎక్కువ మంది రక్త దానం చేయగలరు అని బోనకల్ మండల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, యువత ఎక్కువ మంది పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.
Post Views: 78









