హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి జూన్ 13.
మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని తిమ్మక్క పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు దుర్గా గౌడ్ తండ్రి బాలరాజు గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం తిమ్మక్క పల్లి గ్రామానికి చేరుకొని దుర్గ గౌడ్ కుటుంబాని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితోపాటు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం.లావణ్య రెడ్డి, మెదక్ మండల మాజీ వైస్ ఎంపీపీ మార్గం.ఆంజనేయులు,నాయకులు ఎలక్షన్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
Post Views: 89









