రామాయంపేట (నేటి దగ్గర ప్రతినిధి) జూన్ 13:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 1200 మంది ఓటర్లు ఉన్న ప్రాంతాన్ని నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను శుక్రవారం నాడు మెదక్ ఆర్డీఓ రమాదేవి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటో వార్డు పరిధిలో 76వ పోలీగ్ స్టేషన్, రెండో వార్డు పరిధిలోని రామయంపేట తండాలో 77వ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు.రెండు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.ఆమె వెంట మండల తహసిల్దార్ రజనీకుమారి అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 302









