*మధ్య భారత దేశంలో ఆపరేషన్ కగారునుఎత్తివేసి,మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి*
తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల.
ఈనెల 17 న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే హైదరాబాద్,ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపు.
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జూన్ 14.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి బాలాజీ నగర్ లో క్రాంతి కళాబృందం వెంకటాచారి ఆధ్వర్యంలో ‘ఆదివాసుల హనాన్ని ఆపాలి-శాంతి చర్చలు జరపాలని’డిమాండ్ చేస్తూ అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యధితులుగా గద్దర్ వెన్నెల పాల్గొని ప్రసంగించారు.
దండకరణ్యంలో ఖనిజ సంపదలు ఇనుము,మాంగనీస్,రాగి,కోబాట్,నికెల్,సీసం,జింక్,టైటానియం,జిర్కోనియం,భారీ టైట్ మైకా,గాలియం అంటిమోని,బొగ్గు,సున్నపురాయి,ఇనుము,రాగి,క్రొమైట్ మరియు బాస్కెట్ వంటి ఖనిజాలు లాంటి సహజ వనరులు అతి ముఖ్యమైనవి ఉన్నాయన్నారు.
ఇలాంటి ఖనిజ వనరులు భారతదేశ ప్రజల అవసరాలు,అభివృద్ధికి దోహద పడుతాయని గుర్తుచేశారు.ఈ ఖనిజ సంపదను బిజెపి నరేంద్ర మోడీ కొంతమంది అంబానీ ఆదానీ లాంటి బడా కోటీశ్వరులకు విలువైన ఖనిజ సంపదలను కట్టబెట్టే కుట్రలో భాగామే అన్నారు.అడవి నుండి ఆదివాసులను వెళ్ళగొటెందుకు పాలు తాగే పసిపాప మొదలుకొని ముసలివారిని ఆపరేషన్ కగార్ పేరుతో అత్యాచారాలు హత్యలు గురిచేస్తున్నారని అన్నారు.హిట్లర్, ముస్సోలిన్ నే తలదన్నేలా నరేంద్రమోడీ బీజేపీ రాజకీయాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఆదివాసులకు అండగా పోరాడుతున్న మావోయిస్టులను పట్టుకొని చిత్రహింసలు పెట్టి,బూటకపు ఎన్కౌంటర్ ల పేరుతో చంపడాన్ని తీవ్రంగా ఖండించారు.మావోయిస్టు రాజకీయాలతో సంబంధం లేకపోయినా అటు ఆదివాసులు,ఇటు మావోయిస్టులు ఈ దేశ పౌరులేనని గ్రహించాలని సూచించారు.శాంతియుత రాజకీయ పరిష్కారానికి అనేకమంది బుద్ధి జీవులు,రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు చేస్తున్న ఆపరేషన్ కగర్ ను ఎత్తివేసి,మానవ హనన నివారణకు శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.న్యాయమైన ప్రజాస్వామికమైన డిమాండ్ ను నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు. చట్టబద్ధ ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని అఖిలపక్షం స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో గద్దర్ వెన్నెలతో పాటు గద్దర్ అభిమాన సంఘం సి. ఎల్ యదగిరి,మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్,కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లెపూల శ్రీకాంత్ యాదవ్,సి.పి.ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,సి.పి.ఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ,పి.డి.ఎం చంద్రమౌళి,ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి,సి.పి.ఎం నాగేష్, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ మోహన్ బైరాగి,కవి,రచయిత ఎస్.కే మీరా,సి.పి.ఐ దర్శనం యాదగిరి,ఇఫ్టూ శివ బాబు,పి.ఓ.డబ్ల్యు (విముక్తి) పెర్క సునీత తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.ఈపై కార్యక్రమంలో వెంకట చారి కళాబృందం మల్లంపల్లి రాజు,గోరటి నాగరాజు,డప్పు ప్రకాష్, అనూష కళాకారులు మరియు సామాజిక కార్యకర్త తెలంగాణ ఉద్యమకారిని పోత సునీత పాడిన ఉద్యమ పాటలు ఎంతగానో ఆకట్టుకు నాయి.సమావేశానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి గద్దర్ వెన్నెలచేత పూలమాలలు వేయించి, రాజ్యాంగ పరిరక్షణకు నినదించారు.అనంతరం గ్యార యాకన్న స్వయంగా రచించి,పాడిన అన్నలంటే? భయమెందుకురో? అనే ఆడియో ప్లేయర్ ను ఆవిష్కరించారు.









