+91 95819 05907

జూలై 12,13 తేదీలలో భద్రాచలంలో టి డబ్ల్యూ జె ఎఫ్ తృతీయ జిల్లా మహాసభలు

★ టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి

నేటి గదర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం(చర్ల/ భద్రాచలం) :వచ్చే నెల జూలై 12,13 తేదీలలో భద్రాచలం పట్టణంలో టిడబ్ల్యూజేఎఫ్ తృతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ అనిల్ రెడ్డి అన్నారు. శుక్రవారం చర్ల మండల కేంద్రంలో జరిగిన తృతీయ మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే తృతీయ మహాసభల సందర్భంగా 12వ తేదీన జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక జర్నలిస్ట్ యూనియన్ టిడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి జర్నలిస్టులకు అండగా నిలిచి జర్నలిస్టుల హక్కులను సాధించిందన్నారు. భద్రాచలంలో ఘనంగా నిర్వహించనున్న తృతీయ మహాసభల విజయవంతనికి యూనియన్ సభ్యులతో పాటు, ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు, కోశాధికారి దొడ్డి హరినాధ వర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి శీరపు సాయి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !