+91 95819 05907

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా… నాదీ హామీ:మంత్రి పొంగులేటి

*మీ ఇంటి పెద్దకొడుకుగా చెప్తున్నా..!

– *అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా… నాదీ హామీ*

– *ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశాం…. మిగిలినవి కూడా చేస్తాం*

– *తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

– *నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన*

నేటి గదర్ న్యూస్,ఖమ్మం:(నేలకొండపల్లి) : అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత… మీ ఇంటి పెద్దకొడుకుగా నాదీ హామీ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా గువ్వలగూడెంలో అంతర్గత సీసీ రోడ్లకు, కోరట్లగూడెం, ముటాపురం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పలుచోట్ల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలు అనేకం అమలు చేసిందని…. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా మిగిలిన హామీలను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దని …. విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. దాదాపుగా ప్రతీ ఇంటికి ఏదో ఒక్క సంక్షేమ పథకం చేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , పలువురు జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !