నేటి గదర్ న్యూస్,పినపాక: భద్రాద్రి థర్మల్ ప్లాంట్ సీఈ బిచ్చన్న కు జన్మదిన శుభాకాంక్షలు వెలువత్తాయి. మంగళవారం సీఈ సీఈ బుచ్చన్న జన్మదినం సందర్భంగా మణుగూరు
భద్రాద్రి థర్మల్ కేంద్రంలో మంగళవారం ఉదయం భద్రాద్రి పరిపాలన విభాగంలోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో బీ టీ పీ ఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న కు అన్ని క్యాడర్లకి చెందిన ఉన్నత స్థాయి అధికారులు,చిన్న స్థాయి ఉద్యోగులు బీ టి పీ ఎస్ అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు వారి సభ్యులు,అన్ని అసోసియేషన్ నాయకులు వారి సభ్యులు ఉమ్మడి గా సీ ఈ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల ఆధ్వర్యంలో సీ ఈ చే కేకులు కట్ చేయించి ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరిపారు. సీఈ బుచ్చన్న ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. సిఈ బుచ్చన్న జన్మదిన సందర్భంగా బీటీపీఎస్ ప్లాంట్ పండుగ వాతావరణం చోటుచేసుకుంది.









