+91 95819 05907

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక అప్పుడే?

నేటి గదర్ న్యూస్,
హైదరాబాద్:

హైదరాబాద్ నగరానికి చెందిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అక్టోబర్ చివరిలో జరగనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది.ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏర్పాట్లను ప్రారంభించాలని సూచనలు పంపింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం ఈ ఎన్నికల నిర్వహణను చేపట్టనుంది. అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది.

ఓటర్ల నమోదుకు గరిష్ఠ ప్రాధాన్యత ఇస్తున్నారు. నామినేషన్ల చివరి తేదీ వరకు కొత్త ఓటర్లను ఫారం-61 ద్వారా నమోదు చేస్తారు. ఇప్పటి వరకు 3,89,954 ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రాజకీయ పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాయని సమాచారం.

ఈవీఎంల లభ్యత, భద్రతపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం చురుగ్గా వ్యవహరిస్తోంది. అవసరమైన 500 యంత్రాలకు బదులుగా జీహెచ్ఎంసీ 1000 ఈవీఎంలను సిద్ధం చేసింది. భద్రత కోసం రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు. పోలింగ్, కౌంటింగ్ కోసం సుమారు 1500 మంది సిబ్బంది అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ప్రకారం, ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు ప్రకటించాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !