AP:అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసిహింస★కన్న కొడుకు ముందే ధారుణం★ఏ పి సీఎం నియోజకవర్గంలోధారుణ సంఘటన
నేటి గదర్ న్యూస్,ఆంధ్రప్రదేశ్(కుప్పం):
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అప్పు చెల్లించలేదని ఓ మహిళలను తన కన్న కొడుకు కళ్ళ ఎదుట చెట్టుకు కట్టేసి కర్రతో దాడి చేయడమే కాకుండా మొహంపై ఉమ్మేసి .. అసభ్యకరంగా సాటి మహిళ ప్రవర్తించిన హృదయ విధాతర సంఘటన జరిగింది.వివరాలు..కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు శిరీష (25), భర్త తిమ్మరాయప్ప లు అప్పు తీసుకున్నారు.ఈ నేపథ్యంలో సకాలంలో అప్పు చెల్లించలేదని శిరీష రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలరని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని మునికన్నప్ప బెదిరింపులకు పాల్పడింది.కాగా కొడుకు కళ్ళముందే తల్లిని చెట్టుకు కట్టేసి కొడుతుంటే బాలుడు బోరున రోదించాడు.అప్పు తీర్చలేక భార్య శిరీష (25) బిడ్డలను గ్రామాన్ని వదిలివెళ్ళిపోయిన భర్త తిమ్మరాయప్ప.
కూలి పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి శిరీషను అవమానించిన సాటి మహిళపై చర్యలు తీసుకోవాలని, శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు కోరారు.









