నేటి గదర్ న్యూస్,ఖమ్మం:
గౌడ జాతి ముద్దుబిడ్డ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కంఠమహేశ్వర స్వామి గుడి చైర్మన్ మారగాని వెంకటేశ్వర్లు గౌడ్ పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడారు. గౌడ జాతి ఔన్నత్యానికి చేసిన కృషిని గుర్తుచేసుకొని ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు, దళిత బహుజనుల సమాజానికి సేవ చేయాలన్నదే సర్దార్ పాపన్నగౌడ్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ ప్రజాప్రతినిధులు, కల్లుగీత కార్మిక సంఘం నేతలు, గౌడ యువత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 99









