నేటి గదర్ వెబ్ డెస్క్:
తెలంగాణ బాహుబలి, విప్లవయోధుడు, ఓరుగల్లు వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు.
ఆత్మగౌరవానికి, పోరాటపటిమకు, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
పేదరికం, సామాజిక నేపథ్యం రాజకీయాలకు, రాజ్య పాలనకు అడ్డు కాదని చాటి చెప్పిన పాపన్న గౌడ్ జీవితమే నేటి తరం యువ నాయకులకు ఒక గొప్ప సందేశం.
పాతికేళ్ల వయసులోనే విప్లవకారుడిగా మారి మొఘల్ చక్రవర్తుల దురాగతాల్ని ఎదిరించి తన పరాక్రమంతో వరంగల్ కోటను, గోల్కొండ కోటను జయించి ప్రజా రంజకంగా వారు చేసిన పాలన ఎంతో స్ఫూర్తిదాయకం
Post Views: 97









