మహిళలపై జరుగుతున్న దాడులు,అత్యాచారాలు అరికట్టాలి
పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు కార్యదర్శి తోడెం దుర్గ డిమాండ్
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి.ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో జమ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి తోడెం దుర్గ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ములకలపల్లి మండల పరిధిలో ముకమామిడి గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం మండల మహాసభ మడకం విజయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సభను ఉద్దేశించి డివిజన్ కార్యదర్శి తోడెం దుర్గ మాట్లాడుతూ.ఆరు గ్యారెంటీ ల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రతి మహిళా ఎకౌంట్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు మహిళలకు అన్ని విధాలుగా సమాన హక్కులు కల్పించాలని మహిళల మీద జరుగుతున్న దాడులు,అత్యాచారాలు ప్రభుత్వలు అరికట్టాలని డిమాండ్ చేశారు.గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని,గ్రామాలలో బెల్ట్ షాపులు అరికట్టి కుటుంబాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు గ్రామాలలో మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మనివ్వడం సరికాదని, మద్యానికి పద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని, ప్రభుత్వాం మాత్రం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యిందని ప్రభుత్వాన్ని విమర్శించారు.గత వారం పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో దోమలు ప్రబలి ప్రతి ఇంటిలో విష జ్వరాల బారిన పడుతున్న ప్రభుత్వాం మాత్రం పట్టించుకోవట్లేదు.ప్రభుత్వం వైద్య అధికారులను ఆదేశించి వెంటనే గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని,ప్రతి గ్రామంలో బ్లీచింగ్ శానిటరీ,క్లీనింగ్ వంటి పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టాలి.ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మహాసభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్,పార్టీ మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ మాట్లాడుతూ. మహిళలను ఉద్దేశించి సమాజంలో మహిళల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని,సమాజంలో స్త్రీ పురుషులు వంటి భేదాలు లేకుండా ఇద్దరికీ సమాన హక్కులు కల్పించి మహిళలు అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని మాట్లాడారు. అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు నూప సరోజిని,రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్ర గొర్ల రామారావు,పౌర హక్కుల సంఘం నాయకులు బండారి నాగేంద్రబాబు మాట్లాడారు.అనంతరం నూతన కమిటీని ప్రవేశపెట్టడం జరిగింది.సంఘ అధ్యక్ష,కార్యదర్శులుగా మడకం విజయ,కల్లూరి పద్మ,ఉపాధ్యక్షులు ఇర్ఫా తులసమ్మ,సహాయ కార్యదర్శిగా మోడియం శ్యామల కోశాధికారిక తురసం భవాని ఎన్నుకోవడం జరిగింది.కమిటీ సభ్యులుగా సున్నం రమాదేవి పదం పాపమ్మ సోడే ముత్తమ్మ ఈసం శ్రీలత పొడియం పుష్ప సోయం సుహాసిని,బండారు సుహాసిని ఈర్ప జయమ్మ పాయం వెంకటమ్మ కనకం దుర్గ పద్దం శ్యామల తదితరులను మండల సభ్యురాలుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు తాటి రత్తమ్మ మండల మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.









