నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలంలోని రైతులకు సోదరులకు తెలియజేయునది ఏమనగా ఈనెల 26వ తారీకు నుంచి పంట నమోదు కార్యక్రమం ప్రారంభించబడినది కావున రైతులందరూ కూడా తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి తమ యొక్క పంటను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం డిజిటల్ క్రాప్ బుకింగ్ ద్వారా పంట నమోదు చేయడం జరుగుతుంది మరియు వరి, పెసర, పత్తి,మొదలగు పంటలను విక్రయించేటప్పుడు ఆన్లైన్ నమోదు తప్పనిసరి చేసినందున మరియు పంట నమోదు అనేది రైతు భరోసా కి తప్పనిసరి చేసినందున, రైతులందరూ కూడా పంట నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ పంట నమోదు కార్యక్రమం అక్టోబర్ 25 లోపు చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులును మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస కోరినారు.
Post Views: 222









