సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదినారాయణ, తుంబూరు దయాకర్ రెడ్డి
నేటి గద్దర్ న్యూస్, చండ్రుగొండ, సెప్టెంబర్, 01: అశ్వారావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఈ నెల 3న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం సభాస్థలిని పరిశీలించారు. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను చూసిన తర్వాత, సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు ప్రజలు, అతిథులు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
Post Views: 239









