పల్లె ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం! మాజీ ఎమ్మెల్యే Dr బానోత్ చంద్రావతి తీవ్ర ఆవేదన.
నేటి గదర్ న్యూస్, వైరా/కొణిజర్ల:
తుపానుల తర్వాత పల్లెల్లో పారిశుద్ధ్య లోపం ప్రబలి, డెంగ్యూ, మలేరియా, పాముకాటు వంటి ప్రమాదకర వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వైరా మాజీ ఎమ్మెల్యే డా. బానోత్ చంద్రావతి మండిపడ్డారు.
కొణిజర్ల మండలం పెద్దగోపతి, కొణిజర్ల ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యం అందక ఎందరో పేదలు అనారోగ్యంతో మృతి చెందుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రస్తుత ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు, తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది, అవసరమైన మందులు, మెరుగైన ఆసుపత్రి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి, పల్లె ప్రజల ప్రాణాలను కాపాడాలి.









