ఆరు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాల రైతులను,వెంటనే ఆదుకోవాలి- సిపిఐ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి,:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం గత ఆరు రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు కారణంగా పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి అన్నారు , సోమవారం పంట పొలాలు వరద పడి నష్టపోయిన రైతులును కలిసి పంట పొలాలను పరిశీలించారు. సిపిఐ పార్టీ బృందం వారు మాట్లాడుతూ పంట చేతికొచ్చే పంటలు వర్షాలతోటి దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వాన్ని రైతులను ఆదుకోవాలని. పెసర పంట మునిగిన రైతుకు ఎకరానికి ఇరవై వేలు,మొక్కజొన్న, వరి రైతులకు ఎకరానికి ముప్పై వేలు, పత్తి రైతులుకు ఎకరానికి 50వేలు, రూ నష్టపరిహారం ఇవ్వాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలలో వర్షాల వలన అంటువ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ చల్లించాలి అని. ప్రభుత్వం వెంటనే అధికారుల బృందలను గ్రామాలకు పంపాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు. మండల నాయకులు గోగుల ఆది.మట్టా రవి.గ్రామ నాయకులు కోటయ్య.గురుమూర్తి గురవయ్య.శంకరరావు నాగుల్ మీర్.మస్తాన్.రసూల్ సాయి. తిరుపతిరావు. తదితరులు పాల్గొన్నారు.









