నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 1: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సరియైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ వెంటనే స్పందించారు. సమస్యను స్వయంగా పరిశీలించేందుకు ఆయన మునిసిపల్ అధికారులను వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకున్నారు. వర్షపు నీటితో నిండిపోయిన డ్రైనేజీలు, జలమయమైన వీధులను అధికారులకు చూపించారు. గ్రామస్తుల కష్టాలను అడిగి తెలుసుకున్న జూపల్లి రమేష్, వెంటనే సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని సూచించారు. అధికారులు దీనిపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ సకాలంలో స్పందించి, అధికారులను రప్పించి తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కూడా అనేక సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.









