*రైతులకు యూరియా సకాలం లో అందించలేని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు:*
*చందా రామకృష్ణ ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు*
నేటి గదర్ కరకగూడెం: మండలములో రైతులు పండించే పంటకాలం పూర్తి అవుతున్నా ఇప్పటికీ యూరియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అందించలేని స్థితి లో ఉందన్నారు
ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు చందా రామకృష్ణ.
గురువారం కరకగూడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వలు కళ్ల మూచుకొని ఉన్నాయన్నారు. రైతులను ఎరువుల కొరతను సృష్టిస్తున్న ఈ ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.రైతులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పరిమితి లేకుండా ఎకరాకు 3 యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.









