+91 95819 05907

ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడా… ఉపాధ్యాయ దినోత్సవం రోజున నీ గౌరవం ఎక్కడా..!

ప్రైవేట్ టీచర్లకు భీమా సౌకర్యం కల్పించాలి.

జిల్లా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రైవేట్ టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇచ్చి గౌరవించాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ టీచర్లను గుర్తించాలి

ప్రభుత్వ టీచర్లతో సమానంగా ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు టీచర్లు

ప్రైవేట్ టీచర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్

విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ టీచర్లను గుర్తించాలి.

నేటి గదర్ మెదక్ (భూపాల్ మాదిగ ) సెప్టెంబర్ 5.

ప్రైవేట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపిటిఎఫ్) మెదక్ జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు బిఈడి, టిటిసి, టిపిటి, హెచ్ పి టి, పీజీ లు చదివి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండి, టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎన్నో సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సరైన గుర్తింపు లేదని ప్రైవేట్ టేచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్న వారికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సరైన గుర్తింపునిచ్చి, ప్రైవేట్ టీచర్లకు బీమా సౌకర్యాన్ని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. విద్యాశాఖ నిర్వహించే పరీక్షలలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రాణించడానికి ప్రైవేట్ పాఠశాలల టీచర్లు విశేషంగా కృషి చేస్తూ సేవలందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ టీచర్ల సేవలను గుర్తించి వారికి సరైన గౌరవం పొందేలా కృషి చేయాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !