+91 95819 05907

పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి.

ఉపాధ్యాయ పెన్షనర్ల అభినందన సభలో నగర మేయర్ పునుకొల్లు నీరజ.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పెన్షనర్స్ భవనంలో జరిగిన సీనియర్ ఉపాధ్యాయ పెన్షనర్ల అభినందన సభ జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షతన జరిగినది . ఈ సందర్భంగా నగర మేయర్ నీరజ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదని , ఎన్నో శిలలను శిల్పాలుగా మార్చి జీవితాలను త్యాగం చేసిన ఉపాధ్యాయులను ఎవరూ మర్చిపోరని , తన స్థానం మారకపోయినా తన శిష్యుని అభివృద్ధిని కోరుకునే గురువు పూజ్యుడని కొనియాడారు . ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ విద్యా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని . ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు రిటైర్డ్ ఉద్యోగస్తులంతా ప్రభుత్వానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు . జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నదని రిటైర్ అయిన 16 నెలలు గడిచినప్పటికీ ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందించడం లేదని డిఏలు ఇవ్వడం లేదు పిఆర్సి ని మర్చిపోయారని రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య కార్డులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వం గురిచేస్తుందని తెలియజేశారు . జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వైఖరి పట్ల నిరసన తెలుపుతూ భవిష్యత్తులో ఆందోళన చేపట్టినట్టు తెలిపారు . అనంతరం జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయ పెన్షనర్లు 20 మందిని ఘనంగా సన్మానించారు . కూసుమంచి , నేలకొండపల్లి , ఖమ్మం , వైరా , తల్లాడ , ఏన్కూరు , కల్లూరు , పెనుబల్లి , సత్తుపల్లి , మధిర ప్రాంతాల పెన్షనర్లు ఈ సత్కారంలో ఉన్నారు . కలికొండ సూర్యనారాయణ , కొండపల్లి శేఖర్ రెడ్డి , సుగుణ , రాజేంద్రన్ , లక్ష్మయ్య , ప్రభాకర్ , బాబురావు , పూర్ణచందర్రావు , నారాయణ , మోహన్ రావు , గోపయ్య , అబ్దుల్ రబ్ , దేవరాజ్ , బి కృష్ణయ్య , ప్రసాద్ , వెంకటాచార్యులు తదితర సీనియర్ ఉపాధ్యాయ పెన్షనర్లను ఈ సందర్భంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డీకే శర్మ , తాళ్లూరి వేణు , జనార్దన్ రావు , ఉపేందర్ రావు , సాంబశివరావు , దుర్గాదేవి , ఎస్ పూర్ణచందర్రావు , రాజారావు , చల్ది బాబురావు , జగన్మోహన్రావు , ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !