+91 95819 05907

తిరుమలకుంట గణపతి లడ్డూ ₹21,116కు వేలం

జూపల్లి యువసేన కైవసం చేసుకున్న లడ్డూ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 6: అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట పంచాయతీలోని రామాలయం ప్రాంగణంలో గొల్లపల్లి వెంకన్నబాబు – గొల్లపల్లి నరసింహారావు (బ్రదర్స్) విగ్రహ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామాలయం అర్చకులు రమేష్ చంద్ర పర్యవేక్షణలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా 11 రోజుల పాటు విశేషంగా పూజలందుకున్న గణపతి చేతిలోని లడ్డూను వేలం పాట ద్వారా దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపారు. గణపతి చేతిలోని లడ్డూను దక్కించుకోవడం వల్ల విశేష శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ లడ్డూ ప్రసాదాన్ని తమ వ్యవసాయ భూమిలో లేదా వ్యాపార సంస్థలలో ఉంచుకోవడం, బంధుమిత్రులకు ప్రసాదంగా ఇవ్వడం ద్వారా అదృష్టం వస్తుందని వారు నమ్ముతారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా 11 రోజుల పాటు జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున నిర్వహించిన లడ్డూ వేలం పాటను జూపల్లి యువసేన సభ్యులు అత్యధికంగా ₹21,116కు పాడి, లడ్డూను కైవసం చేసుకున్నారు. తమ అభిమానంతో లడ్డూ ప్రసాదం దక్కినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !