*తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, జవ్వాజి లక్ష్మీనారాయణ ఆశయ సాధన కోసం గిరిజన సమాజమంతా కృషి చేద్దామని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు గొట్టం ఉపేందర్ అన్నారు. శనివారం జవ్వాజి లక్ష్మీనారాయణ వర్ధంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షపాతిగా నిరంతరం ఆదివాసి సమాజ సమస్యలపై పోరాడిన గిరిజన మహనీయుడు అని వారు అన్నారు. భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, ఆరవ షెడ్యూల్ ఆదివాసి హక్కుల కొరకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఆదివాసి ప్రజల చట్టాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్య పరిచే వారని అన్నారు. వన్ బై 70 యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని ఆయన ఎన్నో ఉద్యమాలను చేశారని అన్నారు. నిరంతరం ఆదివాసీల కోసం పాటుపడే మహనీయుడిని ఆదివాసి సమాజం కోల్పోవడం ఆదివాసి సమాజానికి తీరనిలోటని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు కబ్బాకుల శ్రవణ్ కుమార్, కోడెం వెంకటేశ్వర్లు, వట్టం కన్నయ్య, గుంపిడి వెంకటేశ్వర్లు, పూనెం శ్రీను, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కోరం సీతారాములు, బిఆర్ఎస్ పార్టీ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, చింతా వెంకటేశ్వర్లు, మోకాళ్ళ కన్నయ్య, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, మోకాళ్ళ మహేందర్, జవ్వాజి జోషి,మాస్ లైన్ నాయకులు పూనెం మంగయ్య, తదితరులు పాల్గొన్నారు









