నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేటలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన నడుస్తోందని, తమ ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తుందని అన్నారు. ప్రతి పథకం, ప్రతి నిర్ణయం ప్రజల మేలు కోసమే పారదర్శకంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









