పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం
సీపీ సునీల్ దత్ చే సత్కారం
ఖమ్మం, నేటి గదర్ న్యూస్:
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూల మాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సన్మానంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలందించారని పోలీస్ కమిషనర్ కొనియాడారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై డీ రామయ్య, ఏ ఆర్ ఎస్ ఐ లు ఎ.గోపి, ఎస్కే యాకుబ్ పాషా, హెడ్ కానిస్టేబుల్ పీ. శాంతారెడ్డి, హోంగార్డ్ పిఎల్సీ జీ వెంకన్న
కార్యక్రమంలో అదనపు డీసీపి లు బొజ్జ రామానుజం, ప్రసాద్ రావు, ఏసిపి సుశీల్ సింగ్, ఆర్ ఐ శ్రీశైలం, నాగుల్ మీరా పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వేంకటేశ్వర్లు, ఏ ఆర్ ఎస్సై లక్ష్మణరావు, ఖమ్మం జిల్లా హోం గార్డ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, సభ్యులు సిహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








