+91 95819 05907

అశ్వారావుపేటలో ‘గులాబీ’ శంఖారావం: 22 వార్డుల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం – మెచ్చా నాగేశ్వరరావు

​భారీ ర్యాలీతో 8వ వార్డు అభ్యర్థి కాసాని పద్మ సహా ఎనిమిది మంది నామినేషన్.. కాంగ్రెస్ ‘420’ హామీలపై మాజీ ఎమ్మెల్యే నిప్పులు!

నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 29: నూతనంగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారాయి. గురువారం తెలుగుదేశం పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ అభ్యర్థిగా 8వ వార్డు నుండి కాసాని పద్మ తో పాటు, మరో ఎనిమిది మంది అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రైకార్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మరియు వందలాది మంది కార్యకర్తలు పాల్గొని అశ్వారావుపేట వీధులను గులాబీ మయం చేశారు. నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే మా అభ్యర్థులను గెలిపిస్తుంది. అశ్వారావుపేటలోని 22 వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. “కాంగ్రెస్ పరిపాలన ఎంత దారుణంగా ఉందో అశ్వారావుపేట రింగ్ రోడ్డు పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని ఈ మాటల ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వారందరి చూపు ఇప్పుడు బిఆర్ఎస్ వైపే ఉంది” అని స్పష్టం చేశారు. మండల సీనియర్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ నామినేషన్ల పర్వం అశ్వారావుపేట మున్సిపల్ పోరులో బిఆర్ఎస్ ఆధిక్యాన్ని చాటిచెప్పింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !