+91 95819 05907

పురపాలక ఎన్నికల మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్,ఖమ్మం టౌన్:

కలెక్టరేట్ మొదటి అంతస్తు, ఎఫ్-3లో గల జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి గురువారం ప్రారంభించారు. పురపాలక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్‌ మీడియా ప్రచారం పై మీడియా కేంద్రం ద్వారా నిఘా పెట్టనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల సంబంధ సమాచారం మీడియా కు ఎప్పటికప్పుడు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. ప్రింట్ మీడియాలో ప్రచార ఖర్చుపై నిఘా,ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రచార అనుమతులకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ సభ్యులు, కార్యాలయ టైపిస్ట్ కె. ప్రవల్లిక, కంప్యూటర్ ఆపరేటర్లు నవీన్, హరీష్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !