కేవలం పాటలు రాసి, పాడి కోట్లాది జనం గుండె చప్పుడు కాలేదాయన. ఆచరణ ప్రక్రియకు వెనుకాడక అజ్ఞాతంలోకి వెళ్లి సంవత్సరాల పాటు ఉద్యమ యుద్ధరంగంలో సైనికుడై ముందు నడిచినవారు. అందుకే తిరిగి మైదానంలోకి అడుగిడినా ప్రజాసైనికుని పాత్ర నిర్వహిస్తూ వచ్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్ గారి జయంతి జ్ఞాపకం !
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దళిత రచయిత గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు గారు ప్రముఖ విప్లవ కవి. వారికి గద్దర్ అనే పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన “గదర్ పార్టీ” కి గుర్తుగా పెట్టుకోవడం జరిగింది.
……
గుమ్మడి విఠల్ గారు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాబ్యాసం చేసిన గద్దర్. ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్‌లో చదివారు. ఆంధ్రమహాసభ ఉద్యమస్ఫూర్తితో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉబికి వచ్చినట్టే, 1969 ఉద్యమం మిగిల్చిన నిరాశానిస్పృహల నుంచి విప్లవోద్యమ లావా ఎగిసిపడిందన్న అవగాహన ఉన్నవారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశాడు. కేవలం పాటలు రాసి, పాడి కోట్లాది జనం గుండె చప్పుడు కాలేదాయన. ఆచరణ ప్రక్రియకు వెనుకాడక అజ్ఞాతంలోకి వెళ్లి సంవత్సరాల పాటు ఉద్యమ యుద్ధరంగంలో సైనికుడై ముందు నడిచినవాడు గద్దర్. అందుకే తిరిగి మైదానంలోకి అడుగిడినా ప్రజాసైనికుని పాత్ర నిర్వహిస్తూ వచ్చాడు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్.. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
…..
ప్రారంభంలో గద్దర్ గారు కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసి కెనర బ్యాంకులో క్లార్క్ గా ఉద్యోగం సంపాదించారు. తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల ఉన్నారు.
• జీవితం తొలి దశలో ….
గద్దర్ గారు1980లలో విప్లవ కారుడిగా అజ్ఞాత జీవితం గడిపారు.అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ సభ్యులు గా ఉండేవారు. ఆ పార్టీ యొక్క సాంస్కృతిక విభాగంలో భాగం అయ్యి విస్తృతంగా ప్రజల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. 1997లో గద్దర్ గారి మీద విఫలమైన హత్య ప్రయత్నం జరిగింది.
…..
మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డిలుగా రికార్డ్ అయ్యి అత్యదికంగా అమ్ముడుపోయాయి.
…….
మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
……
1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావు లను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రంగా నిరసించారు.
• తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో ……
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల యొక్క ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకునే లేదు.
……
గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోఇస్ట్ పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టి నప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. ఆయన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో “తెలంగాణా ప్రజా ఫ్రంట్” పార్టీ స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొంత కాలం ప్రయత్నం చేసారు.
• బుల్లెట్ నుండి బ్యాలెట్ వరకు…..
1980వ దశకంలో అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిన గద్దర్, అతను స్థాపించిన జన నాట్య మండలి అనే ట్రావెలింగ్ థియేటర్ గ్రూప్‌లో భాగంగా ఉన్నాడు మరియు అది తరువాత CPI(ML) పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగంగా మారింది, అది తరువాత CPI(మావోయిస్ట్)లో విలీనమైంది. అతని ప్రదర్శనలు ఎల్లప్పుడూ భారీ సమూహాలను ఆకర్షించాయి, మనోహరమైన స్వరం మరియు సరళమైన సాహిత్యం ద్వారా ఆకర్షించబడ్డాయి. 2010 వరకు నక్సల్ ఉద్యమంలో చురుగ్గా కొనసాగిన గద్దర్.. 2017లో అధికారికంగా మావోయిస్టు పార్టీతో తెగతెంపులు చేసుకుని అంబేద్కరిస్టుగా ప్రకటించుకున్నారు.
• ఇకపై రాజకీయ ప్రక్రియకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు….
గద్దర్ గారు కొత్త అవతారం, మావోయిస్టులు తమ వ్యూహాన్ని సమీక్షించుకునేలా ప్రభావితం చేస్తుందని అతను ఆశించాడు.” సిర్ఫ్ గన్ హాయ్ నహీ, కభీ వోట్ భీ ఉఠావో (కేవలం తుపాకులను ఆశ్రయించకండి, బ్యాలెట్‌ని కూడా ఉపయోగించుకోండి)” అని అతను తన మాజీ సహచరులకు తన సలహా ఇచ్చారు.
…….
“పోరాటానికి కొత్త వ్యూహం అవసరమని నా భావన. మనం యుద్ధాన్ని ఆపాలని నేను అనడం లేదు, కానీ మనం మూలన పడ్డాము మరియు కొత్త వ్యూహం అవసరం, ”అని గద్దర్ చెప్పారు, తన స్టాండ్ పూర్తి నిరాయుధీకరణకు పిలుపు లేదా ప్రధాన స్రవంతిలో చేరడానికి ఒక పిలుపు కాదని వివరించారు
…..
ప్రస్తుత కాలంలో గద్దర్‌ను వర్గీకరించడం కష్టం. ఖాదీ, శాలువా మరియు లాఠీ ధరించి, తన ముత్యాల తెల్లటి గడ్డం మరియు జుట్టుతో వెళ్ళడానికి, అతను హైదరాబాద్‌లోని సబర్బన్ ప్రాంతంలోని భూదేవి కాలనీలోని ఒక లేన్‌లో అతిపెద్ద ఇంట్లో నివసిస్తున్నారు.
……
అతని లాఠీలో ఇప్పుడు ఎరుపు రంగు గుడ్డతో పాటు నీలం రంగు రిబ్బన్ ఉంది. “నేను మావోయిస్టు వివేకాన్ని (ఎరుపు) స్వీకరించాను మరియు దానిని బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జ్యోతిరావ్ ఫూలే (నీలం) ఆలోచనలతో జత చేసాను.” అని ప్రకటించుకున్నారు.
• ‘రాజ్యాంగాన్ని కాపాడాలి’ …..
ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తన ప్రవేశం, “మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం”లో అడుగు పెట్టాలని భావించినందున గద్దర్ చెప్పారు.
…..
తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ఖమ్మం లో ఆమరణ నిరాహార దీక్ష అర్ధాంతరంగా విరమించినప్పుడు గద్దర్ ఘాటుగా కేసీఆర్ ను నిందించి ఇకపై ఉద్యమం ఉస్మానియా విద్యార్దులు తమ చేతుల్లోకి తీసుకొని ఉద్యమిస్తామని ప్రకటించడం తో గత్యంతరం లేని కేసీఆర్ స్వతాగ ఇష్టం లేకున్నా తిరిగి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. కేసీఆర్ ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని గద్దర్ పట్ల అయిష్టతను పెంచకొని గద్దర్ గారిని దూరంగా పెట్టారు. ఒకానొక సందర్భంలో గద్దర్ గారు ప్రగతి భవన్ గేటు దగ్గర మూడు గంటల సేపు ఎదురు చూసినా కేసీఆర్ కలవడానికి అనుమతించలేదు.
…….
“దేశ భక్తి పేరుతో ఈ దేశంలో జరుగుతున్న పిచ్చి ,” అని ఆయన అన్నారు, “ఫండమెంటలిస్టులు” పాలించే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ మంచి ఎంపిక అని ఆయన అన్నారు – ఇది భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి స్పష్టమైన సూచన. “కాంగ్రెస్‌ను ‘ఉదారవాద బూర్జువా’గా అంచనా వేయడం లేదు” అని గద్దర్ చెప్పారు. ప్రజాకూటమి లైన్‌లో గద్దర్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మరియు దాని ముఖ్యమంత్రి K. చంద్రశేఖర్ రావు తో తలపడ్డారు. కేసీఆర్‌ను ‘నక్క’ అని పిలిచిన గద్దర్, ‘నయా ఫ్యూడలిజం’ అనే కాన్సెప్ట్‌ను సీఎం ప్రవేశపెట్టారని చెప్పారు: “అతను (కేసీఆర్) అణగారిన వర్గాలకు తనను తాను మెస్సీయాగా చెప్పుకుంటాడు, కాని అతని విధానాలు వారిని పేదలుగా మారుస్తాయి అని విమర్శించారు.
• ఇతర వివరాలు…..
ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించారు.
…..
ఇటివల ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది.
• మరణం…
1980 దశకం నాటి దళిత స్త్రీవాద ఉద్యమాలు సంచలనశీమైనవి. స్వయంగా దళితవర్గానికి చెందినవాడు కావడం వల్ల వర్గపోరాటంతో పాటు వర్ణపోరాటం కూడా అవసరమనుకున్నాడు. దళితవాదాన్ని స్వీకరించి అసంఖ్యాకంగా పాటలు పాడాడు. డా. బి.ఆర్. అంబేడ్కర్ ఉత్సవాలలో పాల్గొన్నాడు. ఆ రకంగా సమన్వయవాదం వైపు అడుగులు వేశాడు. ఫలితంగా సమకాలీన రాజకీయాలలో కూడా తనదైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ (74) కన్నుమూశారు. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్ అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని భావిస్తుండగా.. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. ఏదిఏమైనా అర్ధ శతాబ్ది సాహిత్య సాంస్కృతిక రాజకీయ చరిత్రలో మార్పు కోసం కృషి చేసిన చరిత్రపురుషునిగా గద్దర్ సుస్థిరంగా నిలిచివుంటారు.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
Mahammad Gouse గారి వాల్ నుండి సేకరించబడింది








