+91 95819 05907

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..*
*18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..*
*ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..*
*తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..*
*రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ అధికారి శ్రీరామ్ ప్రస్థానం..*
*వ్యవస్థతో యుద్ధం.. 30 సార్లు స్థానచలనం*
కొందరు అధికారులు ఏళ్ళ తరబడి ఒకే చోట తిష్టవేసేందుకు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ, శ్రీరామ్ అనే పేరు వింటే ఆ వ్యవస్థే భయపడుతుంది. ఎందుకంటే ఆయన నిఘంటువులో రాజీ అనే పదానికి చోటు లేదు. 18 ఏళ్ళ సుదీర్ఘ పోలీస్ సర్వీసులో ఏకంగా 30 సార్లు బదిలీ కావడం అనేది భారత పోలీస్ చరిత్రలోనే ఒక అరుదైన, ఆశ్చర్యకరమైన విషయం..
2007లో ముదిగుబ్బలో ఎస్ఐగా ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీరామ్ అడుగు పెట్టిన ప్రతి చోటా చట్టాన్ని కాపాడటమే తన ధర్మంగా భావించారు. రాజకీయ ఒత్తిళ్ళను పట్టించుకోకుండా, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఆయన చేసిన నేరం.. అందుకే కేవలం 40 రోజులకే బదిలీ అయిన సందర్భాలు కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, తాజాగా ప్రొద్దుటూరు.. ఇలా ఊర్లు మారాయి, కానీ ఆయన ధరించిన ఖాకీ డ్రెస్ విలువ మాత్రం మసకబారలేదు..
*కుటుంబానికి దూరం.. ధర్మానికి దగ్గర*
బదిలీ అంటే కేవలం ఒక ఊరు మారడం కాదు, కుటుంబం మొత్తం అతలాకుతలం అవ్వడం. 18 ఏళ్లలో 30 సార్లు సామాన్లు సర్దుకోవడం అంటే ఒక మనిషి ఎంతటి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి.. వ్యక్తిగత సుఖాల కంటే వృత్తి ధర్మానికే ఆయన పెద్దపీట వేశారు. అందుకే ప్రజల దృష్టిలో ఆయన *ట్రాన్స్‌ఫర్ స్టార్*
“నిజాయితీగా ఉండటం కష్టమే కావచ్చు.. కానీ అది ఇచ్చే ఆత్మతృప్తి వెలకట్టలేనిదని శ్రీరామ్ పయనం నిరూపిస్తోంది. అధికారం ముందు తలవంచని ఇలాంటి అధికారులు ఉన్నంత కాలమే సామాన్యుడికి న్యాయంపై నమ్మకం ఉంటుంది. కుర్చీలు మారినా, ప్రాంతాలు మారినా.. శ్రీరామ్ లాంటి ‘రియల్ స్టార్’ల సంకల్పం ఎప్పటికీ మారదు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !