వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.
నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి ఐదవ వార్డులో ప్రచారాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అన్నారు. అదేవిధంగా సిపిఎం బిఆర్ఎస్ కౌన్సిలర్ ను కూడా గెలిపించాలని చైర్పర్సన్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం వైరా నియోజకవర్గ కార్యదర్శి భూఖ్య వీరభద్రం ,బిఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, బిఆర్ యూస్ మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు,మద్దేల రవి, వనమా విశ్వేశ్వరరావు ,కామినేని శ్రీనివాసరావు ,లాల్ మహమ్మద్, కొత్త వెంకటేశ్వరరావు, నూకల వాసు, నూకల ప్రసాదు,అప్పం సురేష్, అదూ రి ప్రేమ్ కుమార్, కారుకొండ బోసు, వేముల శివకుమార్ , గింజుపల్లి జనార్ధన్ ,సిపిఎం నాయకులు సుంకర సుధాకర్ , వల్లెపు రాము,తదితరులు పాల్గొన్నారు








