+91 95819 05907

సిపిఐ(ఎం) అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి

స్థానిక సంస్థలు బలోపేతం కోసం పోరాడుతున్న సిపిఐ(ఎం) అభ్యర్థులను ప్రజలు గెలిపించాలి

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

నేటి గదర్ న్యూస్, వైరా:-
స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. వైరా మండలం విప్పలమడక ఎంపీటీసీ పరిధిలోని శాఖలు విప్పలమడక, లింగన్నపాలెం పార్టీ సభ్యుల సమావేశం వైరా బోడెపూడి భవనంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూక్యా వీరభద్రం మాట్లాడుతూ స్థానిక సంస్థలు బలోపేతం కోసం సిపిఐ(ఎం) అనేక పోరాటాలు చేసిందని, నిధులు, విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు కేటాయించాలని పార్టీ కొట్లాడుతుందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను ప్రజలు గెలిపించారని కోరారు. సిపిఎంతో ఎన్నికలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ఎన్నికల సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, బాజోజి రమణ, విప్పలమడక మాజీ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మండల కమిటీ సభ్యులు మెడా శారాబంది, బానాల కృష్ణమాచారి, షేక్ జానీ, లింగన్నపాలెం మాజీ సర్పంచ్ బాణాల వెంకట్రావమ్మ, మురళి, గరిడేపల్లి పుల్లయ్య, పుల్లయ్య, నాగేంద్ర చారి, మేరా, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !