+91 95819 05907

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ​

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్

​గండుగలపల్లిలో కీలక సమావేశం; పొదెం వీరయ్య, ఎమ్మెల్యే జారె సమక్షంలో నేతల విస్తృత చర్చ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 05: స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయదలిచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు, నాయకులు హాజరయ్యారు. దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ధర్మారావు పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమక్షంలో ఆశావహుల నుంచి వారి పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సరైన అభ్యర్థులను ఎంపిక చేసి, స్థానాలను గెలుచుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని నేతలు స్పష్టం చేశారు. ​ఈ కీలక కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘ ప్రతినిధులు, సేవాదళ్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !