నేటి గదర్ కరకగూడెం: మండల కేంద్రంలోని అనతారం సెక్టార్ పరిధిలోని చొప్పాల అంగన్‌వాడీ కేంద్రాంలో సిడిపిఒ పొలెబోయిన. విజయలక్ష్మి ఆదేశాల మేరకు పోషణ మహోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతారం సెక్టర్ సూపర్‌వైజర్ రాజమణి మాట్లాడుతూ గర్భం దాల్చిన ప్రతి మహిళ వెంటనే అంగన్వాడీ కేంద్రాలలో పేరు నమోదు చేసుకోవాలని, అంగన్వాడి కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రక్తహీనత నివారించడానికి ప్రతిరోజు క్యారెట్,బొప్పాయి, బీట్రూట్, ఆకుకూరలు, పాలు, గుడ్లు, కూరగాయలు తీసుకోవాలని వివరించారు. గర్భిణీలకు శ్రీమంతం, ఏడు నెలల పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేపట్టారు. సెక్టర్ పరిధిలోని టీచర్లు ఎట్టి సుజాత,కుంజా సావిత్రి,అయ్యోరు.సునిత,పూర్ణిమ,భానుప్రియ,
శిరీష,అమరావతి,విజయలక్ష్మి, అనురాధ,రేణుక స్వర్ణలత,రమదేవి సుశీల,ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.









