అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల
★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ చూసినా అశుభ్రతకు నిలయంగా దర్శనమిస్తుంది. స్థానిక పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ అయినప్పటికీ ఇక్కడ మాత్రం పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదు .తిన్న ఆహారంతో పాటు ఇతర మిగిలిన పదార్థాలను పాఠశాల ఆవరణంలోనే విచ్చలవిడిగా పడేయడంతో అక్కడికి వీధి కుక్కలతో పాటు కోతులు అధిక సంఖ్యలో వచ్చి పలుమార్లు విద్యార్థులపై దాడులకు సైతం దిగినాయి. గతంలో పాఠశాల జరుగుతున్న సమయంలోనే తరగతి గదిలోకి కోతులు విద్యార్థులపై దాడి చేసినప్పటికీ గోప్యంగా ఉంచి విద్యార్థులకు చికిత్స అందించారు అయినా తీర్మారని పాఠశాల సిబ్బంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న సందర్భంగా వ్యవహరిస్తున్నారు మండల కేంద్రంలోని పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే మండలంలో ఉన్న మిగతా పాఠశాల పరిస్థితి ఎలా ఉంటుందో అని మండల ప్రజలు చర్చించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు విద్యాశాఖ అధికారులు గుండాల జిల్లా పరిషత్ పాఠశాల పై దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








