అశ్వరావుపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత -15 క్వింటాళ్లు స్వాధీనం
గ్రామాల్లో దాడులు నిర్వహించిన పౌర సరఫరాల అధికారులు; కేసులు నమోదు
నేటి గద్దర్ న్యూస్, అశ్వరావుపేట, అక్టోబర్, 17: మండలంలో అక్రమంగా నిల్వ చేసిన భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. అశ్వరావుపేట మండలంలోని ఆసుపాక, జమ్మిగూడెం, తిరుమలకుంట, గుమ్మడవల్లి గ్రామాల్లో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 15 క్వింటాళ్ల రేషన్ బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఇళ్లలో అక్రమంగా ఈ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ పట్టివేతకు సంబంధించి వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఇన్చార్జ్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. ఇలాంటి అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభాకర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.









