నేటి గదర్ కరకగూడెం:స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ఈ నెల 25 26 వ తేదీలలో కరకగూడెం మండలంలోని 16 గ్రామపంచాయతీల బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవాలని బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో కారుగుర్తుతో ఉన్నటువంటి జెండానే ఈ నెల 25 వ తారీఖున 8 గంటల నుండి 11 గంటల సమయం లో నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున సమన్వయంతో బిఅర్ఎస్ పార్టీ జెండాలను ఎగరవేయ్యాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అయన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలను కోరారు.
Post Views: 31









