+91 95819 05907

నాయక పోడుల ‘యువ గర్జన’: ప్రత్యేక సీరియల్ నెంబరు, నిధులు కేటాయించాలని డిమాండ్

నాయక పోడుల ‘యువ గర్జన’: ప్రత్యేక సీరియల్ నెంబరు, నిధులు కేటాయించాలని డిమాండ్

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో నాయక పోడు కులస్తులు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున గళం విప్పారు. దమ్మపేట లో ఆదివారం నాయక పోడుల ఆధ్వర్యంలో ‘దేవుళ్ల సమ్మెలన’ కార్యక్రమం పేరుతో ‘యువ గర్జన’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నాయక పోడు కులస్తులు తమ కుల దేవతలతో కలిసి దమ్మపేటలోని తాహసీల్దార్ కార్యాలయం దగ్గర నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ నెమలిపేట వరకు సాగింది, అక్కడ వారు ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో నాయకులు మాట్లాడుతూ, చారిత్రక ఆధారాలను ఉదహరించారు. 1949లో నిజాం నవాబు హయాంలోనే హైదరాబాద్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తమను నాయక పోడు తెగగా ప్రత్యేకంగా గుర్తించారని గుర్తు చేశారు. అయితే, 1950 సంవత్సరంలో ప్రకటించబడిన గిరిజన తెగల జాబితాలో తమను గోండులలో ఉప తెగగా కలిపి చూపించారని, కొత్తగా ఆంద్ అనే తెగను మాత్రం గిరిజన జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గోండు జాతిలో కలపడం వల్ల నాయక పోడు జాతి అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేకపోయిందని, తాము వెనుకబడి ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు. తమకు సపరేట్ సీరియల్ నెంబరు కేటాయించడం ద్వారా విద్యా, వైద్యం, ఉపాధి వంటి ప్రభుత్వ ఫలాలు నేరుగా తమ తెగకు అంది, నాయక పోడు జాతి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని నాయక పోడుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. కాబట్టి, పూర్తిగా వెనుకబడి ఉన్న నాయక పోడు కులానికి ప్రత్యేక సీరియల్ నెంబరు కేటాయించాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !