+91 95819 05907

సిపిఐ సీనియర్ సభ్యురాలు సుగుణమ్మ మృతి.

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :

భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట
యోధురాలు వంకాయలపాటి సుగుణమ్మ (92) ఆదివారం మరణించారు. మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన సుగుణమ్మ భర్త వంకాయలపాటి సీతయ్య సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా -పనిచేశారు. సుగుణమ్మ రెండు సార్లు ఖమ్మం సమితి సభ్యురాలిగా పనిచేశారు. తుది శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీ -సభ్యురాలిగా సుగుణమ్మ కొనసాగారు. సుగుణమ్మ జాతీయ మహిళా సమాఖ్య ఖమ్మం జిల్లా నాయకురాలిగా రెండు దశాబ్దాల కాలం పాటు వివిధ హోదాలలో పని చేశారు. ఆమె కుమారుడు వంకాయలపాటి సత్యనారాయణ సిపిఐ నుంచి ఎంపిటిసిగా పనిచేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి -సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ సుగుణమ్మ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. నిబద్దత కలిగిన కమ్యూనిస్టును కోల్పోయామని వారు సంతాప సందేశంలో పేర్కొన్నారు. సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి సుగుణమ్మ మృతదేహాన్ని సందర్శించి అరుణ పతాకాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికార్జున్, మండల నాయకులు తాళ్లూరి యాదగిరి, బిఆర్ఎస్ నాయకులు రంగారావు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !