+91 95819 05907

మల్కారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దమ్మపేట మార్కెట్ చైర్మన్ వాసం రాణి

డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు; రైతులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, మల్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులకు సౌకర్యవంతంగా ఉండేందుకు కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మల్కారం గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో వ్యవసాయ మార్కెట్‌కు అనుసందానంగా ఈ కేంద్రాన్ని డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి మాట్లాడుతూ మల్కారం పరిధిలోని రైతులు ఇబ్బందులకు గురికాకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు అన్నివేళలా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున మండల పరిధిలో అన్ని విధాల సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రైతులు తమ ధాన్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని, వారు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డ్వాక్రా మహిళలు, మల్కారం ఉమ్మడి పంచాయతీ రైతులు, స్థానిక రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !