*రోడ్లపై దాన్యం ఆరబయడం ద్వారా ప్రమాదాలకు మూలం*
*గుండాల సీఐ ఎల్ రవీందర్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, రోడ్లపై రైతులు ధాన్యం ఆరబోయడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు మూలంగా మారుతున్నాయని గుండాల సీఐ ఎల్. రవీందర్ అన్నారు. బుధవారం గుండాల నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు మొక్కజొన్న పంటను ఆరబోసిన తరుణంలో రైతులతో మాట్లాడి ప్రమాదాల గురించి వివరించారు. ముఖ్యంగా మూలమలుపుల వద్ద ధాన్యం ఆరబోయడం ద్వారా ఎదురెదురుగా వచ్చే వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయని ఆయన అన్నారు. మంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో రోడ్లపై ఉన్న దాన్యం ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనపడవని అలాంటి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు వాహనదారులు కూడా కొంచెం మెల్లగా రావడం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని పొలాలలో ఆరబెట్టుకోవాలని సూచించారు
Post Views: 79









