తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.
జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు సీఎం హేమంత్ సోరెన్ గారికి అందజేశారు.
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ దిశగా అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు మరియు భవిష్యత్తు కార్యాచరణను నిర్వచించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధమైందని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
నీతి ఆయోగ్ సలహాలు, నిపుణుల మేథోమథనం, పలు కార్యాచరణ రంగాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.









