సింగరేణి గ్రామపంచాయతీ బి ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా షేక్ గౌసుద్దీన్ నామినేషన్.
నేటి గదర్ న్యూస్, వైరా/ సింగరేణి:
సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీ పరిధిలో సింగరేణి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగరేణి పంచాయతీ మాజీ ఒకటోవ వార్డు సభ్యుడు గంగారబోయిన సత్యం ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి గ్రామపంచాయతీ కీ బి,ఆర్,ఎస్ పార్టీ,బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా షేక్ గౌసుద్దీన్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మంజుల మదన్లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బి,ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు అదే విధంగా వారిచ్చిన ప్రతి ఒక్క గ్యారెంటీలు అమలు కావాలంటే బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో బి,ఆర్,ఎస్ పార్టీ మండల నాయకులు డొంకెన రవీందర్, సింగరేణి మాజీ ఎంపీటీసీ జడల వసంత, ఉప సర్పంచ్ మణికొండ నాగేశ్వరరావు, తెలంగాణ ఉద్యమకారులు సోమందుల నాగరాజు, గిద్ద వారి గూడెం గ్రామ నాయకులు తెలగర్ల రామారావు,సింగరేణి మండల నాయకులు గంగర పోయిన మురళి,మండల యువజన నాయకులు జడల కళ్యాణం,భోగిళ్ళ వెంకటేశ్వర్లు, తొగరు రమేష్, తలారి అనీలు,నందను రి సురేషు,కలిలుల్లా ఖాన్, పేర్ని వెంకటేశ్వర్లు,తురక రవి,తురక సాంబ,చింతల సంపతు తదితరులు పాల్గొనటం జరిగింది.









