*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.*
ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని శంషారెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ స్థానం ఎస్టి జనరల్ రిజర్వ్ కాగా ఆ గ్రామం నుంచి ఒక్కరే సర్పంచ్ స్థానానికి బానోత్ గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి క్షణంలో గణేష్ పై తన తనయుడు బానావత్ వినోద్ తన తండ్రి పైనే నామినేషన్ వేసేందుకు రాగా తండా వాసులు ఏకగ్రీవం చేసుకుందామని వారించారు. వినోద్ తను వినను అని పోటీలో ఉంటానని నామినేషన్ పత్రాలతో ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలోకి వెళ్ళగా అక్కడే ఉన్న గిరిజనులు ఆయనను నామినేషన్ వేయవద్దని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికి అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మనస్థాపానికి గురైన వినోద్ పత్రాలను చించి వేసి ఆరు బయటకు వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఈ తతంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్కడ గల పలువురు ఇదేమి రాజ్యాంగం అంటూ చర్చించుకున్నారు.









